Deepak Hooda to play for Rajasthan, will be part of RCA camp starting July 19
#DeepakHooda
#Baroda
#Domesticcricket
#KrunalPandya
#Teamindia
#Punjabkings
#Ipl2021

టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, బరోడా టీమ్ వైస్ కెప్టెన్ దీపక్ హుడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్ లో బరోడా జట్టుకు ఆడిన హుడా.. ఆ టీమ్ కు గుడ్ బై చెప్పాడు. బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) నుంచి అతడు అభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా తీసుకున్నాడు. దీపక్ హుడా వచ్చే సీజన్ లో రాజస్థాన్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. బరోడా టీమ్ కు అతడు వీడ్కోలు పలకడానికి అసలు కారణం ఆ జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యాతో జరిగిన గొడవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.